ఆ విషయంలో నయనతారను ఫాలో అవుతున్న హీరోయిన్ అపర్ణా బాలమురళి

by Disha Web Desk 10 |
ఆ విషయంలో నయనతారను ఫాలో అవుతున్న హీరోయిన్ అపర్ణా బాలమురళి
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎంతో మంచి హీరోయిన్‌లకు ఆదర్శంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బాటలోనే నడుస్తుంది మరో ముద్దుగుమ్మ. ఆమె ఎవరో కాదు అపర్ణా బాలమురళి. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు సుపరిచితురాలే. సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే నయనతార హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా చేస్తుంది. కాగా ఈ విషయంలోనే నయన్‌ను ఫాలో అవుతుంది ఈ బ్యూటీ. వ్యాపార రంగాల్లో బిజీ కావాలని, తన మిత్రులతో కలిసి వస్త్ర వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నయన్ అపర్ణకు కంగ్రాట్స్ చెప్పింది.

Next Story

Most Viewed