కెరీర్ విషయంలో ఎవరి మాట వినను: సిమ్రాన్

by sudharani |
కెరీర్ విషయంలో ఎవరి మాట వినను: సిమ్రాన్
X

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి పరిచయం అక్కర్లేదు. టాప్ హీరోయిన్ పొజిషన్‌లో ఉన్నప్పటికీ ఐటమ్ సాంగ్స్ చేసి జనాలను మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ‘నా జీవితానికి సంబంధించి ఏ నిర్ణయమైనా నాదే. ఎవరి సలహా నాకు నచ్చదు. ఒకసారి హీరో విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. చేయొద్దని అప్పుడు నాకు చాలా మంది సలహాలు ఇచ్చారు. కానీ, నేను ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా చేశా. ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది. వారి మాటలు విని ఉంటే నాకు అంత మంచి హిట్ వచ్చేది కాదు’ అంటూ చెప్పుకొచ్చింది సిమ్రాన్.

Also Read..

నా పని ఇంకా అయిపోలేదు.. ‘బుడ్డీ’ కామెంట్స్‌పై నటి ఫైర్

Next Story