- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెన్సార్ పూర్తి చేసుకున్న అనుష్క ‘ఘాటి’.. శీలావతి పాలన ప్రారంభం కాబోతుందంటూ మేకర్స్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. లావు పెరగడంతో సోషల్ మీడియాకే కాకుండా అసలు ఎక్కడా కనిపించకుండా పోయింది. ప్రస్తుతం అనుష్క శెట్టి ‘ఘాటి’ (Ghati)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి.
తాజాగా, ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డ్ జారీ చేయగా.. ‘ఘాటి’ 2 గంట 37 నిమిషాల నిడివి ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉండగా.. ఇందులో శీలావతి పాత్రలో అనుష్క ఇరదీసినట్లు చిత్రబృందం చెబుతోంది. గంజాయి సరఫరా చేసే పాత్రలో అనుష్క రస్టిక్ ఫర్ఫార్మెన్స్‌తో మెప్పించనుందట. ఇక ఇంటర్వెల్ వరకు సాఫీగా సాగి ఆ తర్వాత ఆడియన్స్‌ను పూర్తిగా షాక్‌కు గురిచేయడం ఖాయమని మూవీ మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాతో అనుష్క బ్లాక్ బస్టర్ కొట్టబోతోందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ విడుదలకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ అనుష్క ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం గమనార్హం. ఆమె బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్‌కు హాజరు కాకూడదని డిసైట్ అయినట్లు టాక్.






