‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో అనుష్క వింటేజ్ లుక్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 9 |
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో అనుష్క వింటేజ్ లుక్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. జాతిరత్నాలు హీరో నవీన్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేష్ అనే యంగ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన టీజర్, పోస్టర్లతో పాటు నోనోనో, హతవిధి, లేడీ లక్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అనుష్క పోస్టర్ విడుదల చేశారు. ఈ తాజా లుక్‌లో సూపర్ స్లిమ్‌‌గా నవీన్‌తో కలిసి.. నడుస్తూ ఊహాల్లో విహరిస్తున్నట్లు ఓ పిక్ వైరల్ అవుతుంది. ఇందులో స్విటీ చాలా స్మాట్‌గా ఉండటంతో నెటిజన్లు.. ‘ఒక్కసారిగా అంత బరువు ఎలా తగ్గావ్ స్విటీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబరు 7న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Read More: ఆ సిరీస్‌లో దళిత స్త్రీ ప్రతిఘటన.. ప్రశంసిస్తూ అంబేడ్కర్ మనవడి ట్వీట్

Next Story

Most Viewed