అనుష్క శెట్టి ‘ఘాటి’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) రెండేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అనుష్క శెట్టి ‘ఘాటి’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) రెండేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ‘ఘాటి’(Ghati) చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రంగా తెరకెక్కగా.. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మించారు. ఇందులో విక్రమ్ ప్రభు(Vikram Prabhu) ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఇందులో అనేక హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో సెన్సార్ బోర్డు వాటికి కట్ చెప్పి U/A సర్టిఫికెట్ జారీచేసింది. ఈ సినిమా (సెప్టెంబర్ 5 న) నేడు ఘనంగా థియేటర్స్‌లో రిలీజ్ అయింది.

ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. ‘ఘాటి’ ఫస్టాఫ్ అద్భుతంగా ఉందరి కొందరు అంటుంటే.. మరికొందరేమో సెకండాఫ్ అదిరిపోయిందని అంటున్నారు. అనుష్క చాలా కాలం తర్వాత తన రేంజ్‌కి తగ్గ సినిమా చేసిందంటున్నారు. అనుష్క తన కెరీర్ మొత్తంలో ఘాటిలోనే వైల్డెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదిరిపోయే నటనతో చంపేసింది. క్రిష్ సార్ గుడ్ జాబ్ సినిమా సూపర్‌గా తెరకెక్కించారని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు నెగెటివ్ కామెంట్లు పెట్టినప్పటికీ ‘ఘాటి’ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. అలాగే అనుష్క పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి తన అభినయం, భావోద్వేగాలతో ఊహించని లుక్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్వీట్

LINK

Next Story