Anushka Shetty: అనుష్క శెట్టి ‘ఘాటి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో హైప్ పెంచేసిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-02 11:11:26  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ‘సూపర్’ చిత్రంతో వచ్చి హిట్‌ సాధించింది.

Anushka Shetty: అనుష్క శెట్టి ‘ఘాటి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో హైప్ పెంచేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ‘సూపర్’ చిత్రంతో వచ్చి హిట్‌ సాధించింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్ సరసన నటించి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుని కొద్ది కాలంపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే ‘బాహుబలి-2’(Baahubali-2) ద్వారా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. కానీ ఆ తర్వాత బొద్దుగా కావడంతో పూర్తిగా సినిమాలకు దూరం అయింది. మళ్లీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’(Ghati). క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇక ఇందులో తమిళ నటుడు విక్రమ్ ప్రభు(Vikram Prabhu) కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే లేడీ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వాయిదా పడింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అనుష్క అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఎప్పుడెప్పుడు విడుదల తేదీ ప్రకటిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘ఘాటి’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, భాషల్లో జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అనుష్కతో పాటు కొంతమంది ఓ పెద్ద నదిలో కొంతమంది మూటలు మోస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు.

Next Story