- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన చిన్ననాటి జ్జాపకాలను గుర్తుచేసుకున్నాడు. బాల్యంలో కుటుంబం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని, అయినా పేరెంట్స్ అప్పుచేసి మరి తనను ఓ కార్పోరేట్ స్కూల్లో చేర్పించి ఇంతవాడిని చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనురాగ్.. 'మా పేరెంట్స్ 1970లో పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాతే అమ్మ డిగ్రీ పూర్తి చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నపుడు నేను పుట్టాను. అమ్మా నాన్నలకు చదువంటే చాలా ఇష్టం. దీంతో నన్ను భారతదేశంలో అత్యుత్తమ పాఠశాల 'సింధియా'లో చేర్పించేందుకు వారి శక్తికి మించి అప్పులు చేశారు. అదే నన్ను ఈరోజు ఇంతటి వాడిని చేసింది' అంటూ చేసిన ఎమోషనల్ పోస్ట్ నెటిజన్లను కదిలించింది.
Next Story






