- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్లుగా తాగిన డైరెక్టర్‌కు హార్ట్ ఎటాక్..
పాపులర్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఎందుకు ఆల్కహాల్‌కు అడిక్ట్ అయ్యాడో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సుకేతు మెహతా ప్రసిద్ధ నవల ‘మాగ్జిమమ్ సిటీ’ ఆధారంగా అదే పేరుతో గతంలో ప్రాజెక్ట్ తెరకెక్కించినట్లు తెలిపాడు.

దిశ, సినిమా : పాపులర్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఎందుకు ఆల్కహాల్‌కు అడిక్ట్ అయ్యాడో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సుకేతు మెహతా ప్రసిద్ధ నవల ‘మాగ్జిమమ్ సిటీ’ ఆధారంగా అదే పేరుతో గతంలో ప్రాజెక్ట్ తెరకెక్కించినట్లు తెలిపాడు. లైఫ్‌లోనే అంత బెస్ట్ అండ్ హానెస్ట్ వర్క్ ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. నెట్‌ఫ్లి్క్స్ ఈ సినిమా నుంచి వైదొలగడంతో సినిమా నిలిచిపోయిందని, అది కాస్త తన హెల్త్‌పై ఇంపాక్ట్ పడిందని చెప్పాడు. దాని గురించే ఆలోచిస్తూ డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆయన.. మందుకు బానిస అయ్యానని వివరించాడు. దీంతో రెండు సార్లు హార్ట్ ఎటాక్ కూడా వచ్చిందని బాధపడ్డాడు.
నిర్దిష్ట కారణం లేకుండానే ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న అనురాగ్ కశ్యప్.. అందులోని కంటెంట్ సున్నితమైనది కావడమే ఇందుకు రీజన్ అయ్యుండొచ్చని తెలిపాడు. ఈ క్రమంలో స్ట్రీమింగ్ స్పేస్‌ను కూడా విమర్శించాడు. సోషల్ మీడియా మాదిరిగా స్ట్రీమింగ్ ఒక రెవల్యూషన్‌గా మారాలని, ప్రజలను మరింత శక్తివంతం చేయాలని కోరుకున్నాడు. కానీ పరిస్థితి అలా లేదని.. ఒక టూల్‌గా మాత్రమే మారిందని చెప్పుకొచ్చాడు.






