'Butterfly' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది !

by Disha Web Desk 10 |
Butterfly ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది !
X

దిశ, సినిమా : కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఇటీవల '18 పేజెస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నటనతో మంచి మార్కులు కొట్టేసింది. త్వరలో 'బటర్‌ఫ్లై' మూవీతో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీని ఘంటా సతీష్‌బాబు తెరకెక్కించారు. భూమిక చావ్లా, రావు రమేష్‌, నిహాల్‌ ముఖ్యపాత్రలు పోషించగా తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడిన అనుపమా.. '2021 డిసెంబరులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి.. నెల రోజుల్లోనే కంప్లీట్ చేశాం. నిర్మాణాంతర పనుల్ని ఏడాది టైమ్‌ తీసుకొని ఎంతో క్వాలిటీతో తీర్చిదిద్దారు. నేను ఈ మూవీలో గీత అనే రోల్‌లో కనిపిస్తా. ఈ పాత్ర చాలా ఛాలెంజ్‌గా అనిపించింది. మంచి థ్రిల్‌ పంచే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కచ్చితంగా నచ్చుతుంది' అని చెప్పింది.

Also Read...

Box Office: 18 Pages 2 days collections

Next Story

Most Viewed