'డీజే టిల్లు 2'లో అనుపమ..? పుట్టుమచ్చల లెక్క కావాలంటున్న ఫ్యాన్స్

by Disha Web |
డీజే టిల్లు 2లో అనుపమ..? పుట్టుమచ్చల లెక్క కావాలంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆ మధ్య కొద్ది గ్యాప్ తర్వాత 'రౌడీబాయ్స్' మూవీతో రీఎంట్రీ ఇచ్చిన నటి.. ఇప్పుడు 'కార్తికేయ2' ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతేకాదు తాజాగా అనుపమకు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. 'డీజే టిల్లు'తో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన సిద్ధు జొన్నలగడ్డ సరసన 'డీజే టిల్లు2'లో చాన్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్రిప్ట్ చదివేసిన అనుపమ.. తన క్యారెక్టర్ పట్ల పాజిటివ్‌గా స్పందించిందని, త్వరలోనే ఫైనల్ డెసిషన్ వెల్లడిస్తానని మేకర్స్‌కు తెలిపినట్లు సమాచారం.

అయితే అనుపమ కంటే ముందు నేహా శర్మను తీసుకోవాలనుకున్న నిర్మాతలు.. ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకుని అనుపమ వైపే మొగ్గు చూపుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ అప్‌డేట్స్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా అనుపమ పుట్టుమచ్చల లెక్క చెప్పాలంటున్నారు ఫ్యాన్స్.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని పెళ్లి టీజర్.. సినిమా రేంజ్‌కు తగ్గకుండా!

Next Story

Most Viewed