రిలీజ్‌కు సిద్ధమైన ‘అనుమాన పక్షి’.. స్పెషల్ గ్లింప్స్‌తో భారీ హైప్ క్రియేట్

by Mallepaka Hamsa |

DJ టిల్లుతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రచయిత, దర్శకుడు విమల్ కృష్ణ(Vimal Krishna), ఇప్పుడు యంగ్ ట్యాలెంటెడ్ రాగ్ మయూర్ (Rag Mayur)హీరో‌గా..

రిలీజ్‌కు సిద్ధమైన ‘అనుమాన పక్షి’.. స్పెషల్ గ్లింప్స్‌తో భారీ హైప్ క్రియేట్
X

దిశ, సినిమా: DJ టిల్లుతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రచయిత, దర్శకుడు విమల్ కృష్ణ(Vimal Krishna), ఇప్పుడు యంగ్ ట్యాలెంటెడ్ రాగ్ మయూర్ (Rag Mayur)హీరో‌గా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హిలేరియస్ ఎంటర్టైనర్ ‘అనుమాన పక్షి’(anumana pakshi) మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో మెరిన్ ఫిలిప్ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ ఇప్పుడు రాగ్ మయూర్ పాత్ర ద్వారా సినిమా రిలీజ్ టైంని వెల్లడించే ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’గా పరిచయం అయ్యారు. అతిగా ఆలోచించడం, అతిగా జాగ్రత్తగా ఉండే స్వభావంతో తన చుట్టూ ఉన్నవారిని గందరగోళపరిచే విచిత్రమైన క్యారెక్టర్ ఆకట్టుకుంది. ప్రోమోతో పాటు, చిత్ర ప్రచార కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయని, ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుందని తెలియజేశారు. ఖచ్చితమైన తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు.

link

Next Story