విడాకులు తీసుకోబోతున్న అనసూయ..! మరికొద్ది రోజుల్లో అసలు విషయం బయటకు..

by Chukka Sudharani |   (  Updated:2023-08-19 11:57:53  IST  )

ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్ ప్రకటించే అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఏడుస్తూ కనిపించడం నెట్టింట చర్చనీయాంశమైంది.

విడాకులు తీసుకోబోతున్న అనసూయ..! మరికొద్ది రోజుల్లో అసలు విషయం బయటకు..
X

దిశ, సినిమా : ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్ ప్రకటించే అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఏడుస్తూ కనిపించడం నెట్టింట చర్చనీయాంశమైంది. ఐదు రోజుల క్రితం రికార్డ్ చేసిన వీడియోను పోస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చిన బ్యూటీ.. నవ్వు, కోపం, దయ, ఓదార్పు లాంటి పోస్టులతో ఇప్పటికే ఫాలోవర్స్‌ను పలకరించానని, ఇప్పుడు ఏడ్వడం కూడా చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అన్నిసార్లు ఒకేలా ఉండమని.. కొన్నిసార్లు మానసికంగా అలసిపోతామని, అందుకే ఈ దు:ఖమని భారీ నోట్ షేర్ చేసింది.

అయితే కొందరు నెటిజన్లు మాత్రమే ఆమె ఎమోషన్‌కు గౌరవమిస్తుండగా.. చాలా మంది ‘ఎద్దులా ఉన్నావ్ ఏడిస్తే బాగోదు’ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో విజయ్ దేవరకొండతో వివాదామే ఇందుకు కారణం అంటుండగా.. ఇంకొందరు విడాకులు తీసుకోబోతోందని జోస్యం చెప్తున్నారు. మొత్తానికి ఇందుకు రీజన్ ఏంటనేది మరికొద్ది రోజుల్లో తప్పక బయటపడుతుందని అంటున్నారు.


Read More: లైవ్‌లో బోరున విలపించిన హాట్ యాంకర్ అనసూయ.. ఎందుకంటే? (వీడియో)

Next Story