‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో మరో టాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్ చేయడంతో అంతా షాక్

by Mallepaka Hamsa |

రష్మిక మందన్న(Rashmika Mandanna) భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది

‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో మరో టాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్..  పోస్టర్ రిలీజ్ చేయడంతో అంతా షాక్
X

దిశ, సినిమా: రష్మిక మందన్న(Rashmika Mandanna) భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. ప్రేక్షకులను అలరిస్తూ.. తన పాపులారిటీని మరింత పెంచుకుంటుంది. ఇటీవల ‘థమా’ హారర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)సినిమాతో రాబోతుంది. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దీక్షిత్ హీరోగా కనిపించనున్నాడు. బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీస్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. అక్టోబర్ 25న ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాలో మరో హీరోయిన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించారు.

టాలీవుడ్ బ్యూటీ అను ఇమాన్యుయేల్ నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ రొమాంటిక్ పోస్టర్‌ను షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్ ధరించి దీక్షిత్‌ను గట్టిగా హగ్ చేసుకుని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తోంది. ఇక ఇందులో ఈ తార దుర్గ పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రయాణంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు అను ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సూపర్ ఎక్జైటెడ్ మిమ్మల్ని ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో చూసేందుకు వేచి ఉండలేమని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇందులో మరో హీరోయిన్ ఉంటుందని అస్సలు ఊహించలేదు అని అంటున్నారు.

Next Story