జ‌క్క‌న్న‌కు షాక్‌..వారణాసి నుంచి మరో లీక్ !

by velandi.Saikiran |   (  Updated:2026-05-29 12:51:50  IST  )

జ‌క్క‌న్న‌కు షాక్‌..వారణాసి నుంచి మరో లీక్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

జ‌క్క‌న్న‌కు షాక్‌..వారణాసి నుంచి మరో లీక్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరువనున్నారు. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు మొదటి నుంచి లీక్ ల బెడద ఎదురు అవుతూనే ఉంది. మొన్న ఒడిస్సా లో జరిగిన తొలి షెడ్యూల్ షూటింగ్ టైంలో కొన్ని సీన్స్ వైరల్ గా మారాయి.

ఇప్పుడు కీలకమైన ఉగ్రభ‌ట్టి గుహ సన్నివేశానికి సంబంధించిన భారీ సెట్ స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో సీరియస్ అయిన జక్కన్న, లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారట. ఇలా ప్రతి సీన్ లీక్ చేస్తే.. ఎలా అని ఇప్పటికే చిత్ర బృందం సభ్యులకు వార్నింగ్ ఇచ్చారట. ఇది ఇలా ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా.. టైం ట్రావెల్, మైథాలజీ నేపథ్యంలో వస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీలో రుద్ర అనే శివ భక్తుడి పాత్రలో మహేష్ బాబు మెరుస్తున్నారు.

Next Story