‘సంక్రాంతికి వస్తున్నాం-2’ కోసం రంగంలోకి మరో హీరోయిన్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

‘సంక్రాంతికి వస్తున్నాం-2’ కోసం రంగంలోకి మరో హీరోయిన్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం-2’ తెరకెక్కించే పనిలో నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూట్‌లో పాల్గొంటుండగా.. అది అయిపోగానే.. ఈ సీక్వెల్‌లో జాయిన్ కానున్నట్లు టాక్. ఇందుకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట.

ఇక మొదటి పార్ట్‌లో వెంకటేష్ కామెడీ, అనిల్ రావిపూడి టేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సీక్వెల్‌లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ కానుందట. ‘సంక్రాంతికి వస్తున్నాం-2’ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌తో పాటు మరొ హీరోయిన్ జాయిన్ కాబోతుందని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అంచనాలను పెంచుతున్నాయి. అలాగే ఆమె ఎవరా అనే ఆసక్తి పెరిగింది.

Next Story