‘RT-76’ సినిమాలో మరో హీరోయిన్ ఫిక్స్.. చార్ట్ బ్లస్టర్ లోడింగ్ అంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-05 06:55:11  IST  )

హాట్ బ్యూటీ డింపుల్ హయాతీ అడపా దడపా చిత్రాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది.

‘RT-76’ సినిమాలో మరో హీరోయిన్ ఫిక్స్.. చార్ట్ బ్లస్టర్ లోడింగ్ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ డింపుల్ హయాతీ అడపా దడపా చిత్రాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈ భామ నిత్యం పలు వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఇక మాస్ మహారాజా రవితేజతో ‘ఖిలాడి’ మూవీలో ‘ఫుల్‌కిక్కు’ సాంగ్‌లో ఆడిపాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి ఆయన సరసన అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. వీరి కాంబోలో మరో ప్రాజెక్ట్ రాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, డింపుల్ హయాతీ (Dimple Hayati)ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అభిమానులతో చిట్ చాట్ చేసిన ఆమె పలు విషయాలపై స్పందించింది. ఈ అమ్మడు రవితేజ (Ravi Teja)సరసన ‘RT-76’ మూవీలో జతకట్టబోతున్నట్లు తెలుపుతూ.. ‘‘షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది.

త్వరలోనే RT-76 నుంచి చార్ట్ బ్లస్టర్ రాబోతుంది. దానిని చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చింది. డింపుల్ హయాతీతో పాటు అషికా రంగనాథ్ (Ashika Ranganath)కూడా ఇందులో భాగం కానుంది. కిషోరు తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనార్కలి వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ పలు ప్రాజెక్టులతో నిరాశకు గురైన రవితేజ ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలన్న కసితో.. ఈ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

Next Story