pawan kalyan ‘హరిహర వీరమల్లు’లో ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరో..!

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-07 16:10:26  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..

pawan kalyan ‘హరిహర వీరమల్లు’లో ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరో..!
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇందులో బాలీవుడ్ హీరో బాబీ డియోల్, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ‘హరిహర వీరమల్లు’ సినిమాలో మరో యంగ్ హీరోను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. వీరమల్లు అనుచరుడి పాత్ర కోసం ఎవరిని హీరోగా తీసుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:

SSMB28 Title: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పండగే.. పండుగ.. అదిరిపోయిన SSMB28 టైటిల్!

Next Story