Mahesh Babu,Trivikram మూవీలో బాలీవుడ్ బ్యూటీ ?

by Disha Web Desk 6 |
Mahesh Babu,Trivikram మూవీలో బాలీవుడ్ బ్యూటీ ?
X

దిశ, సినిమా: వరుస సినిమాలతో ధూసుకుపోతున్న మహేష్ బాబు అదే జోష్‌ కొనసాగిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అతను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏండ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్‌ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నారు. మూవీ సెకండ్ హాఫ్‌లో ఓ లేడీ కానిస్టేబుల్ పాత్రలో ఈమె కనిపించబోతోందని టాక్. అయితే దీని గురించి ఇంకా అధికారికి ప్రకటన రావాల్సి ఉంది.

Also Read..

Chandra Babu, విజయ్ సాయిరెడ్డిపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..



Next Story

Most Viewed