ఆర్మీ అధికారిగా మారిన సల్లుభాయ్.. స్లిమ్‌ అండ్‌ ఫిట్‌ లుక్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Disha Web Desk 9 |
ఆర్మీ అధికారిగా మారిన సల్లుభాయ్.. స్లిమ్‌ అండ్‌ ఫిట్‌ లుక్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్‌, సల్మాన్ ఖాన్ కాంబోలో రాబోతున్న సినిమానుంచి మరో బిగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని కూడా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కార్గిల్‌ యుద్ధం నేపథ్యంలో రూపొందించిన ‘షేర్షా’ చిత్రం చక్కటి దేశభక్తి ఇతివృత్తంతో ప్రేక్షకులను మెప్పించగా ఈ చిత్రాన్ని కూడా అదే కాన్సెప్ట్‌ దేశభక్తి, యుద్ధం ప్రధానాంశాలుగా చూపించేందుకు విష్ణువర్ధన్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని సమాచారం. అంతేకాదు క్యారెక్టర్‌కు అనుగుణంగా స్లిమ్‌ అండ్‌ ఫిట్‌ లుక్‌లో కనిపించడానికి సల్మాన్‌ఖాన్‌ ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నాడని, ఎన్నడూ చూడని సల్మాన్‌ను ఈ మూవీలో చూపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక నవంబర్‌లో రెగ్యూలర్ షూటింగ్ మొదలుకాబోతున్న సినిమాను వచ్చే ఏడాది క్రిస్టమస్‌‌కు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Next Story

Most Viewed