'ఆర్య' నా కెరీర్‌ను మలుపుతిప్పింది : అంకుర్

by Dishanational4 |
ఆర్య నా కెరీర్‌ను మలుపుతిప్పింది : అంకుర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అంకుర్ భాటియా సహనటి సుస్మితా సేన్‌తో కలిసి నటించిన 'ఆర్య' సిరీస్ కెరీర్‌ని మలుపుతిప్పిదంటున్నాడు. ఈ మేరకు ఇటీవల ఇంటర్య్వూలో ఇందుకు సంబంధించిన అనుభవాలను పంచుకున్న నటుడు.. 'ఆర్య నన్ను బిజీ నటుడిగా మార్చేసింది. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించాను. కానీ, ఈ షో తర్వాతే నా కెరీర్ ఊపందుకుంది. సుస్మితా సేన్‌కు సోదరుడిగా పోషించిన పాత్రను ప్రజలు బాగా ఇష్టపడ్డారు. అందరికీ కనెక్ట్ అయింది. రెండవ సీజన్ కోసం కూడా ఇదే క్యారెక్టర్ కంటిన్యూ చేయడం నిజంగా చాలా బాగుంది' అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటినుంచి సెలెక్టివ్‌ స్టోరీలను ఎంచుకునే పద్ధతిని పక్కగా అనుసరిస్తున్నానన్న అంకుర్.. కొన్ని సాధారణ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఏడాదిన్నర పాటు ఖాళీగానే ఉన్నట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి : Aishwarya రెండో బిడ్డకు జన్మనివ్వక పోవడానికి ఆ హీరోనే కారణమా?



Next Story

Most Viewed