అనీత్ పడ్డా- అహాన్ పాండే రొమాంటిక్ డ్రామా షూటింగ్ అప్పటినుంచే!

by Mallepaka Hamsa |

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కథకు సంబంధించిన మార్పులు చేర్పులు, మ్యూజిక్ సిట్టింగ్స్‌తో చిత్రబృందం బిజీగా ఉందట.

అనీత్ పడ్డా- అహాన్ పాండే రొమాంటిక్ డ్రామా షూటింగ్ అప్పటినుంచే!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ‘సయారా’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటనతో వెల్లడించిన విషయం తెలిసిందే. సరికొత్త లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మోహిత్ సూరి, మరో క్రేజీ రొమాంటిక్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. ఇటీవల ‘సయారా’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన క్రేజీ పెయిర్ అహాన్ పాండే, అనీత్ పడ్డాలను ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మళ్లీ ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమాకు ‘సత్రంగా’ అనే టైటిల్ ఖరారు చేయగా.. అప్పుడే బాలీవుడ్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో పట్టాలెక్కబోతోందని టాక్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కథకు సంబంధించిన మార్పులు చేర్పులు, మ్యూజిక్ సిట్టింగ్స్‌తో చిత్రబృందం బిజీగా ఉందట. ‘సయారా’ సాధించిన భారీ విజయం తర్వాత మళ్లీ అదే టీమ్ కలిసి పని చేస్తుండటంతో మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం అహాన్, అనీత్ ఇద్దరూ తాము ఒప్పుకున్న వేరే సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అహాన్ పాండే ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వస్తున్న మూవీలో నటిస్తుండగా.. ఈ జూలై నాటికి అతని షూటింగ్ పూర్తవుతుంది. అలాగే అనీత్ పడ్డా ‘శక్తి శాలిని’ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఈ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన వెంటనే వీరిద్దరూ మోహిత్ సూరి సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారని టాక్.

Next Story