యానిమ‌ల్ సినిమా ర‌న్‌టైమ్ ఫిక్స్‌.. ఎన్ని గంటలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Disha Web Desk 6 |
యానిమ‌ల్ సినిమా ర‌న్‌టైమ్ ఫిక్స్‌.. ఎన్ని గంటలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. దీనిని డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అయితే ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా, యానిమల్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే, పెద్దలు మాత్రమే చూడదగిన సినిమా ఇది. అంతేకాదు, ఈ మూవీ నిడివి కూడా చాలా ఎక్కువ. 3 గంటల 21 నిమిషాల 23 సెకెండ్ల 16 ఫ్రేముల రన్‌టైమ్ అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ రన్‌టైమ్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, సందీప్‌ను ఆటపట్టిస్తూ ఇంకెందుకు 4 గంటలు చేసేయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం యానిమల్ రన్‌టైమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed