‘దండోరా’తో ఆయనకు విజయం దక్కాలి: అనిల్ రావిపూడి

by Mallepaka Hamsa |

శివాజీ(Shivaji), న‌వ‌దీప్‌, నందు, రవికృష్ణ, బిందు మాధ‌వి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దండోరా’(Dhandoraa).

‘దండోరా’తో ఆయనకు విజయం దక్కాలి: అనిల్ రావిపూడి
X

దిశ, సినిమా: శివాజీ(Shivaji), న‌వ‌దీప్‌, నందు, రవికృష్ణ, బిందు మాధ‌వి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దండోరా’(Dhandoraa). మురళీకాంత్ (Muralikanth)దర్శకత్వం వహించగా.. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్‌గా వచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘దండోరా’ నిర్మాత బెన్నీ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు సినిమా మీద ఉండే అభిరుచి నాకు చాలా ఇష్టం. ఆయనెప్పుడూ టేస్ట్ ఉన్న చిత్రాల్నే నిర్మిస్తుంటారు.

మళ్లీ డిసెంబర్ 25న ఈ ‘దండోరా’తో ఆయనకు విజయం దక్కాలి. ఈమూవీ టీజర్, ట్రైలర్ చూస్తుంటే నాకు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా మారుతుందని అనిపించింది’’ అన్నారు. అలాగే నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని మాట్లాడుతూ .. ‘మురళీ నాకు మూడేళ్ల క్రితం స్టోరీ చెప్పాడు. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ‘దండోరా’ లాంటి చిత్రాన్ని సపోర్ట్ చేయాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సపోర్ట్ ఎంతో అవసరం. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీకి స్టోరీనే హీరో, కంటెంట్ హీరోయిన్. మిగతాది సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను’ అని చెప్పారు.

Next Story