- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka)తో అలరించబోతున్నారు.

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka)తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి(Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే రావు రమేష్, మురళీ శర్మ, రాజీవ్ కనకాలు, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది.
నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకుల ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రామ్ నటన అద్భుతంగా ఉందని హీరోలకు అభిమాని అని చెప్పుకునే వారందరూ చూడాలని అంటున్నారు. అంతేకాకుండా రామ్, భ్యాగ్రశ్రీ కెమిస్ట్రీ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి రామ్ హిట్ అందుకున్నాడని అభిమానులు సంతోష పడుతున్నారు. లింక్






