- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఇంత బాగుంటుందని ఊహించలేదంటున్న నెటిజన్లు (వీడియో)
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), పి. మహేష్ కుమార్(P. Mahesh Kumar) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Taluka).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), పి. మహేష్ కుమార్(P. Mahesh Kumar) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Taluka). ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. దీంతో చిత్రబృందం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. తాజాగా, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలే’పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. రామ్ పోతినేని రాసిన ఈ సాంగ్‌ను మ్యూజిక డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. వివేక్, మెర్విన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. నాకే తెలియని నాలో యుద్ధమా...లోలోన సంద్రమా.. లేదే పొంగుతున్నదే ఇంకేదో..! పేరు లేదుగా.. ఇంతే మాట రాదుగా.. అంతే ఒప్పుకో మరి....వింతే లే!!!అని సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక అది చూసిన నెటిజన్లు రామ్ అన్న బాగా రాస్తారని ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు.






