కుమారి ఆంటీకి పోటీగా ఫుడ్ స్టాల్ పెట్టేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్

by Disha Web Desk 6 |
కుమారి ఆంటీకి పోటీగా ఫుడ్ స్టాల్ పెట్టేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: కుమారి ఆంటీ అలియాస్ సాయి కుమారి గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జూబ్లిహిల్స్‌లో ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఆమె ‘‘మీది మొత్తం 1000 రూపీస్ అయింది. రెండు లివర్లు ఎక్ట్రా’’ అనే డైలాగ్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కుమారి ఆంటీ ఫుడ్ వీడియోలో కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల ఆమె స్టాల్‌ను మూసివేశారు.

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు పెట్టుకునే వెసులుబాటు కల్పించడంతో కుమారి ఆంటీకి మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఆమె డైలాగ్స్‌తో ఏకంగా ఓ డీజే సాంగ్‌ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియా మొత్తం కుమారీ ఆంటీ డైలాగ్‌కు సంబంధించిన రీల్స్ మార్మోగిపోతున్నాయి. దానికి సెలబ్రిటీలు సైతం రీల్ చేసేస్తున్నారు.

తాజాగా, యాంకర్ సుమ కుమారి ఆంటీని ఫాలో అవుతూ ఫన్నీ రీల్ చేసింది. ఇక కుమారి ఆంటిలా మారిపోయిన సుమ.. ప్రొడక్షన్ వాళ్లు తెచ్చిన పుడ్‌ను స్టాల్ మాదిరిగా పెట్టి కొంతమందికి వడ్డించింది. అంతేకాకుండా దానికి సుమా అడ్డా షోకి వచ్చిన బ్రహ్మాజీ మాట్లాడిన మాటలు యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో అది చూసిన కొందరు నువ్వు కూడా మొదలెట్టావా అక్కా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా దీనిపై డైరెక్టర్ సుకుమార్ భార్య కూడా స్పందించి ఫన్నీ ఎమోజీలు షేర్ చేసింది.

Next Story

Most Viewed