నా తండ్రితోనే నాకు పెళ్లి చేశారు.. ఇదెక్కడి న్యాయం : Anchor Sreemukhi

by Disha Web Desk 7 |
నా తండ్రితోనే నాకు పెళ్లి చేశారు.. ఇదెక్కడి న్యాయం : Anchor Sreemukhi
X

దిశ, సినిమా: స్టార్ యాంకర్ శ్రీముఖికి ప్రేక్షకులలో రాములమ్మగా ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఓ వైపు టీవీ షోస్‌, డిజిటల్ షోస్ చేస్తూనే అడ‌పా ద‌డ‌పా సినిమాల్లోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉండగా శ్రీముఖి ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అయింది. అయితే తాజాగా దీనిపై స్పందించిన శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది. ''వైరల్ అవుతున్న ఫోటోలోని వ్యక్తి నా తండ్రి, నా తండ్రి‌తో నాకు పెళ్లి చేస్తారా? నా గురించి, నా పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. నా తండ్రి ఫోటోను బ్లర్ చేసి, అతనితో నా పెళ్లి జరగనుందని ప్రచారం చేస్తున్నారు. మరీ ఇంత ఘోరమా.. ఇదెక్కడి న్యాయం'' అంటూ శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

Next Story

Most Viewed