స్టైల్ మార్చిన యాంకర్ ప్రదీప్.. ఈసారి సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు!

by Disha Web Desk 9 |
స్టైల్ మార్చిన యాంకర్ ప్రదీప్.. ఈసారి సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై పలు షోల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు యాంకర్ ప్రదీప్. గతంలో ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఈయన ప్రస్తుతం రొమాంటిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. అలాగే స్టార్ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కబోతుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్, ఈ మూవీలో నటించే నటీనటులు ఎవరో త్వరలోనే తెలియనున్నట్లు సమాచారం.

More News : పెళ్లికి ముందు సెక్స్.. ప్రేమికులు అలాగే చేయాలంటున్న నటి



Next Story

Most Viewed