- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫర్ల కోసం భారీ ప్లాన్ వేసిన అనస్వర.. టాలీవుడ్ స్టార్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్!
మలయాళ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళంలోనూ విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన టాలెంట్‌తో యూత్ క్రష్‌గా మారిపోయింది. ప్రస్తుతం ‘ఛాంపియన్’ సినిమా చేస్తోంది. ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) హీరోగా నటిస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇది హైదరబాద్‌లోని బైరాన్‌పల్లి సంఘటన నేపథ్యంలో 1948 నాటి కథను చెబుతుందని సమాచారం. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఛాంపియన్’ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన అనస్వర.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలను అకాశానికెత్తేసింది.
తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని చెప్పింది. అయితే తన నానమ్మ ఆ చిత్రం చూస్తుంటే చూశానని.. అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. అలాగే అల్లు అర్జున్(Allu Arjun) తెలుగు హీరో అని తనకు తెలియదని.. ఆయనను మలయాళ హీరో అనుకున్నాను అని చెప్పింది. రామ్ చరణ్ ‘మగధీర’ సినిమా చూశాకూ తనకు తెలుగు చిత్రాలు, హీరోల గురించి తెలిసిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు తాను తెలుగు సినిమాలను చూస్తున్నానని తనకే తెలియదని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతండగా.. ఈ విషయం తెలుసుకున్న వారు టాలీవుడ్‌లో ఆఫర్ల కోసమే ఇలా పొగుడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అనస్వర ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుని ఎమోషనల్ అయింది. ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నన్ను స్కూల్లో ఎవరూ పలికరించేవారు కాదు. టీచర్లే నాతో మాట్లాడొద్దని వాళ్ల తల్లిదండ్రులతో చెప్పించేవాళ్లు. క్లాసులో మార్కుల కాస్త తక్కువగా వస్తే.. మూవీస్ చేసుకో బాధపడకు అని హేళన చేసేవారు. నన్ను ఎంతగా అవమానించారో నేను ఈ స్థాయిలో నిలబడేలా చేసింది కూడా వాళ్లే. నేను ‘ఛాంపియన్’లో తాళ్లపూడి చంద్రకళగా నటించాను. అచ్ఛమైన తెలుగు అమ్మాయిగా, హైప్ యాక్టిగ్‌గా ఉంటాను. నన్ను ఒక రౌడీలాగా చూస్తారు’’ అని చెప్పుకొచ్చింది.






