విజయ్ దేవరకొండ తమ్ముడికి సపోర్ట్ చేస్తూ అనసూయ వరుస ట్వీట్లు..

by Disha Web Desk 6 |
విజయ్ దేవరకొండ తమ్ముడికి సపోర్ట్ చేస్తూ అనసూయ వరుస ట్వీట్లు..
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల విజయ్ దేవరకొండ, యాంకర్ అనసూయ మధ్య కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. అనసూయ, విజయ్ ని ఉద్దేశిస్తూ పలు పోస్టులు కూడా చేసింది. అవి చూసిన ఫ్యాన్స్ ఆమెపై ట్రోల్స్ చేయడంతో అతడే డబ్బులిచ్చి మరీ చేయిస్తున్నాడని కానీ తాను మాత్రం అవన్నీ ఆపేద్దామనుకుంటున్నా అంటూ స్పందించింది. అయితే ఈ అమ్మడు ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంటుంది.

తాజాగా, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ సాయి రాజేష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘బేబీ’. ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనిని చూసిన అనసూయ వరుస ట్వీట్లు చేసింది. ‘‘మీ సెలబ్రేషన్స్‌లో ఆలస్యంగా జాయిన్‌ అయ్యాను. సాయిరాజేశ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. ట్రైలర్‌ నాకెంతో నచ్చేసింది. ఒరిజినాలిటీ, హృదయాన్ని తాకేలా ఉన్న మాటలు చూస్తుంటే.. నాకు తెలిసిన వాళ్ల కథ లాగే అనిపిస్తుంది. ఈ సినిమా చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఆనంద్‌ చాలా ఇంటెన్స్‌గా నటించారు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రమించి ఎస్‌కేఎన్‌ నిర్మాతగా ఈ స్థాయికి వచ్చారు. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.




Next Story

Most Viewed