పుష్ప విషయంలో అల్లు అర్జున్‌పై సంచలన కామెంట్స్ చేసిన అనసూయ.. మండిపడుతోన్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్

by Anjali |
పుష్ప విషయంలో అల్లు అర్జున్‌పై సంచలన కామెంట్స్ చేసిన అనసూయ.. మండిపడుతోన్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ యాంకర్ అనసూయ గురించి సుపరిచితమే. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంటుంది. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా రంగస్థలం చిత్రంలో రంగమత్త పాత్రలో.. పుష్పలో దక్షాయణి పాత్రలో అద్భుతంగా నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే ఈ హాట్ యాంకర్ ఎప్పుడు ఇంటర్వ్యూకు హాజరైన ‘పుష్ప గురించి ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటుంది. తాజాగా అనసూయ ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిందంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.

‘‘రీసెంట్‌గా తన డ్యాన్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను గమనించిన బన్నీ.. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకుని పుష్ప -2 లో తన డ్యాన్స్ మూవ్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. డ్యాన్స్ మాత్రమే కాకుండా బన్నీ ఈ మూవీలో కొన్ని తప్పులు కూడా చేశారు. ఆ తప్పులు మళ్లీ రీపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు’’. అంటూ స్వయంగా అనసూయ వెల్లడించినట్లు ట్విట్టర్‌‌లో ఈ న్యూస్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతూ.. అనసూయను దారుణంగా కామెంట్లు చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై తాజాగా అనసూయ స్పందించి.. ‘ నేను బన్నీ గురించి ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడాను. ఇవన్నీ జనాలు సృష్టించిన పుకార్లు మాత్రమే’ అంటూ వెల్లడించింది.Next Story