తన ఒంటిపై ఉన్న టాటూల గురించి ఓపెన్‌గా చెప్పేసిన అనసూయ

by Disha Web Desk 6 |
తన ఒంటిపై ఉన్న టాటూల గురించి ఓపెన్‌గా చెప్పేసిన అనసూయ
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటో షూట్స్ షేర్ చేస్తుంది. ఇటీవల ‘పెద్దకాపు-1’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా, అనసూయ తన ఇన్‌స్టా స్టోరీలో చిట్ చాట్ చేసింది. వెళ్లేందుకు 40 నిమిషాల టైం ఉందని, అంత వరకు అభిమానులు ఏదైనా ప్రశ్న అడగాలని అనుకుంటే అడగండి అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టింది. అందులో ఎక్కువ మంది నెటిజన్లు పెద్దకాపులోకి అక్కమ్మ పాత్ర గురించి అడగ్గా.. ఇక కొందరు అనసూయ బ్యూటీ సీక్రెట్, హెయిర్ ఆయిల్, స్కిన్ క్రీమ్ ఇలా రకరకాల వాటి గురించి అడిగారు. మరొక నెటిజన్ ఏకంగా అనసూయ ఒంటి మీదున్న టాటూల గురించి అడిగాడు. దానికి అనసూయ స్పందించి ఓపెన్‌గా చెప్పేసింది.. ‘‘నా ఒంటి మీద రెండు టాటూలున్నాయి. మొదటి టాటూని నా ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ, మా ఆయన బర్త్ డే ఒకేసారి రావడంతో వేయించుకున్నా.. నిక్కు మా ఆయన పేరు.. రెండోది కేలన్. గ్రీకు భాషలో.. కారెక్టర్ బ్యూటీ’’ అని చెప్పుకొచ్చింది.

Read More: నైట్ పార్టీలో రెచ్చిపోయి మరి డ్రింక్ తాగుతూ విష్ణుప్రియ-రీతూ చౌదరి డ్యాన్సులు (వీడియో)



Next Story

Most Viewed