ఎందుకు ఏడ్చిందో క్లారిటీ ఇచ్చిన అనసూయ.. ట్రోలర్స్‌కు మరోసారి కౌంటర్

by Disha Web Desk 7 |
ఎందుకు ఏడ్చిందో క్లారిటీ ఇచ్చిన అనసూయ.. ట్రోలర్స్‌కు మరోసారి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: నెట్టింట ఎప్పుడూ బోల్డ్ షోతో హంగామా చేసే అనసూయ.. తాజాగా భావోద్వేగానికి గురైన వీడియో షేర్ చేసింది. ‘‘మానసికంగా కుంగిపోయాను. నేను అందరితో అన్ని విషయాలు (నవ్వు, కోపం, దయ, ఓదార్పు) పంచుకుంటా. అలాగే భావోద్వేగాన్ని కూడా అందిరితో పంచుకుంటా’’ అంటూ ఏడుస్తున్న వీడియోను షేర్ చేసింది. దీనిపై కొంత మంది పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం ‘ఎద్దులా ఉన్నావ్ ఏడిస్తే బాగోదు’, ‘మీరు ట్రోల్స్ చెయ్యడం వల్లే అను ఏడుస్తుంది. ఇకనైన ట్రోల్స్ ఆపండి’ అంటూ వెటకారంగా రిప్లైలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ మరో వీడియో వదిలింది అనసూయ.

ఈ మేరకు ‘‘సోషల్ మీడియా వల్ల నేను ఏడ్చే రకం కాదు. నెగిటివిటీ నాకు కొత్తేమి కాదు. అలాంటిది ఏదైనా ఉండే నా ఫీలింగ్ కోపంతో వస్తుంది. ఏడుపుతో కాదు. నా పర్సనల్ లైఫ్‌లో ఒక నిర్ణయం తీసుకున్నా. అందువల్ల ఏర్పడిన వీక్ మూమెంట్‌లో ఏడ్చాను. అలా ఏడ్చిన వెంటనే పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకున్న. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే నాకు షూట్ ఉంది కాబట్టి. సోషల్ మీడియాలో నా లాంటి పబ్లిక్ ఫిగర్ ఏడవడం కరెక్టేనా అని ఆలోచించా. కానీ నేను ఒంటరి కాదు పర్వాలేదు అని భావించే అలా ఏడ్చినా వీడియో పోస్ట్ చేశా’’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇస్తూ క్లారిటీ ఇచ్చింది. అయితే.. ఆ పర్సనల్ విషయం ఏంటో మాత్రం అనసూయ చెప్పలేదు.



Next Story

Most Viewed