Ananya Panday: ఐటమ్ సాంగ్స్ చేస్తానంటున్న అనన్య పాండే.. కానీ డైరెక్టర్స్‌కు షాకింగ్ కండీషన్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2024-09-30 16:48:08  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

Ananya Panday: ఐటమ్ సాంగ్స్ చేస్తానంటున్న అనన్య పాండే.. కానీ డైరెక్టర్స్‌కు షాకింగ్ కండీషన్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ అందాల సుందరి విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ సినిమా 2022లో విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలవడంతో అనన్య బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కెసింది. ఇటీవల ఈ అమ్మడు ‘కంట్రోల్’ అనే ఓటీటీ సినిమాలో నటించింది. అక్టోబర్ 4 నుంచి ఇది ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది.

ఈ క్రమంలో.. అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన ప్రకటన చేసింది. ఇకపై తాను కూడా ఐటమ్ సాంగ్‌లో నటిస్తానని తెలిపింది. కానీ తనకంటూ కొన్ని కండీషన్స్ ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చింది. ‘‘ఐటమ్ సాంగ్స్ చేయడానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఆ పాటలో మరీ అతిగా అందాల ప్రదర్శన చేయకూడదు. అంతేకాకుండా డైరెక్టర్స్ నా పాత్రకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నాను.

కాదంటే అసలు అందులో నటించడానికి కూడా ఒప్పుకోను. అలాగే ఐటమ్ సాంగ్‌లో అమ్మాయిని చూపించే విధానంలో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకప్పటి లాగా చూపించాల్సిన అవసరం లేదు కొత్తగా ట్రై చేసినా ఓకే. అమ్మాయిని అందంగా చూపించాలి కానీ బొమ్మలాగా కాదు. ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోకూడదనే అధికారం పూర్తిగా అమ్మాయికే ఇవ్వాలి. అలా కాకుండా వారు చెప్పిందే చేయాలంటే నేను అసలు ఆ ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా అంగీకరించను. ఒకవేళ ఓకే చేసినా అందులోంచి తప్పుకుంటా’’ అని చెప్పుకొచ్చింది.

Next Story