బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల గురించి సంచలన విషయాలు బయటపెట్టిన అనన్య!

by Disha Web Desk 6 |
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల గురించి సంచలన విషయాలు బయటపెట్టిన అనన్య!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే, ఆదర్శ్ గౌరవ్, సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్రల్లో నటించిన తాజా డ్రామా ‘ఖో గయే హమ్ కహా’. దీనిని దర్శకుడు అర్జున్ వరైన్ సింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి రెప్సాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్టర్స్‌లో సపోర్టీవ్ నెస్ ఉండదు ఒకరి ఛాన్స్ మరొకరి చేతికి పోతే తిట్టుకుంటారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా, అలాంటి వార్తలపై అనన్య పాండే స్పందించింది. ‘‘ ఖో గయో హమ్ కహా సినిమా చూసాక అలియా భట్, మృణాల్ ఠాకూర్, కృతి సనన్ నన్ను మెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆహాన పాత్ర వాళ్లకు బాగా నచ్చిందని ప్రశంసించారు. అలాగే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ వో, గెహ్రైయాన్ వంటి ప్రాజెక్ట్‌లలో తారా సుతారియా, భూమి పెడ్నేకర్, దీపికా పదుకొణెతో కలిసి పని చేసినప్పుడు కూడా పాజిటివ్ రెప్సాన్సులు వచ్చాయి. సినీ పరిశ్రమలోని హీరోయిన్లు ఒకరి వర్క్‌ను ఒకరు మెచ్చుకుంటారు. అలాగే ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed