మేము మనుషులమని మరిచిపోవద్దు.. ట్రోలర్స్‌కు చురకలంటించిన Ananya Panday

by Phanindra |   (  Updated:2023-08-21 11:43:20  IST  )

సోషల్ మీడియా ట్రోలింగ్ తనను ఎలా ప్రభావితం చేస్తుందో వెల్లడించింది అనన్య పాండే

మేము మనుషులమని మరిచిపోవద్దు.. ట్రోలర్స్‌కు చురకలంటించిన Ananya Panday
X

దిశ, సినిమా : సోషల్ మీడియా ట్రోలింగ్ తనను ఎలా ప్రభావితం చేస్తుందో వెల్లడించింది అనన్య పాండే. ‘డ్రీమ్ గర్ల్ 2’తో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానున్న ఆమె ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ‘అభిమానుల నుంచి ప్రేమ, ప్రశంసలను పొందుతున్న నటీనటులు ట్రోలింగ్‌కు కూడా గురవుతారు. ఇందులోనూ ప్లస్, మైనస్‌లు ఉంటాయి. నిజం చెప్పాలంటే ఏ సెలబ్రిటీ దీనికి అతీతులు కాదు. కొందరు ట్రోల్‌లను తిప్పికొడిదే మరికొందరు నెగెటీవ్‌ను అసలే పట్టించుకోరు. కానీ నేను నెగటివ్ కామెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నా. విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను. అయితే పర్సనల్ లైఫ్ ట్రోలింగ్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ నేర్చుకోవడం, ఎదగడం ఆపాలని ఎప్పుడూ అనుకోను’ అని చెప్పింది. అలాగే నటులు కూడా మనుషులే అనే విషయాన్ని ప్రజలు మరిచిపోతున్నారన్న ఆమె.. ఈ విషయం ఎవరినైనా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.

Read More: మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు 'Nenu Super Woman' షో వచ్చేసింది!

Next Story