రామ్ చరణ్‌తో కలిసి 'నాటు నాటు పాట'కు స్టెప్పులేసిన ఆనంద్ మహేంద్ర.. వీడియో వైరల్!

by Disha Web Desk 13 |
రామ్ చరణ్‌తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేసిన ఆనంద్ మహేంద్ర.. వీడియో వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే తొలిసారి హైద‌రాబాద్‌లో జరిగిన ఈ ఫ్రీక్స్ రేసింగ్ ఘ‌నంగా ముగిసింది. ఈ రేసింగ్‌ను చూడ‌టానికి దేశంలోని ప్రముఖ సినీ, క్రీడా ప్రముఖులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ సందర్భంగా రేసును వీక్షించేందుకు వచ్చిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తో కలిసి రేసింగ్ ట్రాక్ వద్ద సందడి చేశారు. ఆనంద్ మహీంద్రా.. రామ్ చరణ్‌తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. రామ్ చరణ్ వన్, టూ, త్రీ చెబుతుండగా.. ఆనంద్ మహీంద్రా ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పంచుకున్నారు.

హైదరాబాద్ గ్రాండ్ ప్రీ సందర్భంగా తనకు నిజమైన బోనస్ లభించిందని, 'నాటు నాటు పాట'కు సంబంధించిన డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో రామ్ చరణ్ నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. థాంక్యూ రామ్ చరణ్.. మీ 'నాటు నాటు పాట' ఆస్కార్‌లో విజేతగా నిలవాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు. ఈ వీడియోపై రామ్ చరణ్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. "ఆనంద్ మహీంద్రా గారూ.. ఈ స్టెప్పులను నాకంటే మీరే త్వరగా నేర్చుకున్నారు" అంటూ ప్రశంసించారు. "మీతో ఎంతో సరదాగా గడిచిపోయింది" అంటూ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed