ఎట్టకేలకు విజయ్ పెళ్లిపై హింట్ ఇచ్చేసిన ఆనంద్ దేవరకొండ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom).

ఎట్టకేలకు విజయ్ పెళ్లిపై హింట్ ఇచ్చేసిన ఆనంద్ దేవరకొండ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి అన్నా తమ్ముడు అనుబంధాన్ని చూపేలా ఉన్న ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఆకట్టుకోవడంతో పాటు సినీ సెలబ్రిటీల మనసుకు హత్తుకుంటోంది. తాజాగా, ఈ పాటపై రౌడీ హీరో తమ్ముడు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘ఈ పాట విని ఎమోషనల్ అయ్యాను. నాకెప్పుడు కష్టం వచ్చినా విజయ్ నా కోసం ముందుంటాడు.

నా కలలను తనివిగా భావిస్తాడు. మన తోబుట్టువులు బయటకు కనిపించకుండానే మనపై ఎంత ప్రేమను చూపిస్తారో మా అన్నను చేస్తూ నాకు అర్ధం అయింది. నా నుంచి ఏమీ ఆశించకుండానే ఎంతో ప్రేమను చూపిస్తారు. బహుశా ఈ పాట మాఇద్దరి కోసమే రాశారు కావచ్చు. అన్న అంటే నీలా ఉండాలి’’ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. అలాగే తన అన్నయ్యతో కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోలన్నింటికి ఓ వీడియో క్రియేట్ చేసి పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇందులో విజయ్, ఆనంద్ రష్మికా మందన్న సిగ్నేచర్ పోజును రీ క్రియేట్ చేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు ఎట్టకేలకు తమ్ముడు రౌడీ హీరోపై పెళ్లిపై హింట్ ఇచ్చాడని అంటున్నారు. అందుకే లాస్ట్‌లో రష్మికనే పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకే ఆమె సిగ్నేచర్ పోజును రీ క్రియేట్ చేశారు అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కావచ్చు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఈ వీడియోలో వదిన కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, గత కొద్ది కాలంగా విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు ప్రాంతాలకు వెకేషన్స్‌కు కూడా వెళ్లి అడ్డంగా కెమెరాలకు చిక్కారు. అయినప్పటికీ ప్రేమపై ఓపెన్ అవకుండా ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ సైలెంట్‌గా ఉన్నారు. అయినప్పటికీ వీరి పెళ్లి వార్తలు నిత్యం వస్తూనే ఉంటాయి. అయితే ఒక్కోసారి రష్మిక పండుగలను విజయ్ ఇంటికి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటుంది.ఈ లవ్ బర్డ్స్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈక్రమంలోనే ఆనంద్ ఈ పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.

link

Next Story