- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాయకుడిగా అదరగొట్టిన నవీన్ పొలిశెట్టి.. ‘అనగనగా ఒక రాజు’ సాంగ్ రిలీజ్
వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty)'అనగనగా ఒక రాజు'(AnaganagaOkaRaju)తో అలరించనున్నారు.

దిశ, సినిమా: వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty)'అనగనగా ఒక రాజు'(AnaganagaOkaRaju)తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా, మొదటి పాట విడుదలైంది. 'భీమవరం బల్మా' పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది. మాస్ ప్రేక్షకులతో పాటు, యువత మెచ్చేలా 'భీమవరం బల్మా' (Bhimavaram Balma)సాంగ్ ఉంది.
ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య ప్రదర్శన కట్టిపడేసింది. ఇద్దరి జోడి చక్కగా కుదిరి, పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. విన్న వెంటనే శ్రోతల మనసు దోచుకోని, వారిచే కాలు కదిపించేలా.. ఆయన స్వరపరిచిన తీరు మెప్పించింది.
చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకునేలా ఉంది. నవీన్ పొలిశెట్టితో కలిసి గాయని నూతన మోహన్ అద్భుతంగా ఆలపించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కానుంది.






