- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధుబాల బయోపిక్‌లో ఊహించని ట్విస్ట్.. రేసులో ఉన్న స్టార్ హీరోయిన్లను కాదని ఆ యంగ్ బ్యూటీకే చాన్స్!
మధుబాల అంటేనే అద్భుతమైన సౌందర్యం, నటన, అంతకు మించిన భావోద్వేగం. అలాంటి పాత్రను పోషించే నటి కోసం చిత్ర యూనిట్ చాలా కాలంగా వేట కొనసాగించింది.

దిశ, సినిమా: భారతీయ సినిమా చరిత్రలో వెండితెర వెన్నెలగా, తిరుగులేని అందగత్తెగా గుర్తింపు పొందిన దిగ్గజ నటి మధుబాల జీవిత కథ ఇప్పుడు బయోపిక్‌గా రాబోతోంది. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతుండగా, తాజాగా ఈ సినిమాలో మధుబాల పాత్రను ఎవరు పోషించబోతున్నారనే విషయంపై ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను విజువల్ వండర్స్‌ను సృష్టించే సంజయ్ లీలా భన్సాలీ తన హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. జస్మీత్ కె. రీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల అంటేనే అద్భుతమైన సౌందర్యం, నటన, అంతకు మించిన భావోద్వేగం. అలాంటి పాత్రను పోషించే నటి కోసం చిత్ర యూనిట్ చాలా కాలంగా వేట కొనసాగించింది. తాజా.. సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలించగా.. సారా అర్జున్ తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. చివరికి మాత్రం మలయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ పేరు ఖరారైనట్లు సమాచారం.
రీసెంట్‌గా వచ్చిన 'లోకా: చాప్టర్1' సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్, ఇప్పుడు మేకర్స్ దృష్టిని ఆకర్షించిందట. మధుబాల పాత్రకు కావలసిన సహజమైన అమాయకత్వం, స్క్రీన్ ప్రెజెన్స్, మరియు క్లాసిక్ లుక్ కళ్యాణిలో పుష్కలంగా ఉన్నాయని నిర్మాతలు భావిస్తున్నారట. ఆమెకు పెరుగుతున్న క్రేజ్ కూడా ఈ భారీ ప్రాజెక్టుకు కలిసొచ్చే అంశమని అందుకే ఆమెనే ఫైనల్ చేసినట్లు టాక్. భారతీయ సినిమాకు ఒక గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మధుబాల లాంటి ఐకానిక్ పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ ఎలా మెప్పిస్తుందో చూడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. భన్సాలీ సినిమా అంటేనే సెట్స్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉంటాయి. మరి కళ్యాణి ప్రియదర్శన్ ఆ పాతకాలపు సౌందర్యాన్ని వెండితెరపై ఎలా చూపిస్తుందో అన్న ఆసక్తి పెరిగిపోయింది.






