Hrithik Roshan : Rajini Kanth తో Hrithik Roshan చిన్ననాటి ఫొటో వైరల్

by Phanindra |   (  Updated:2023-09-26 14:40:26  IST  )

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌లకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

Hrithik Roshan : Rajini Kanth తో Hrithik Roshan చిన్ననాటి ఫొటో వైరల్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌లకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే గతేడాది 51వ దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును కేంద్ర ప్రభుత్వం రజనీకాంత్‌కు ఇస్తున్నట్లు ప్రక‌టించ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీ, రాజ‌కీయ ప్రముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలోనే చాలామంది సినీ ప్రముఖులు రజనీతో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభినంద‌న‌లు తెలుపగా.. తలైవాతో చిన్నప్పుడు దిగిన ఓ ఫొటోను హృతిక్ పోస్ట్ చేశాడు. ఇందులో ఆయనను గట్టిగా హత్తుకున్న హీరో.. ‘మీ గొప్పతనం గురించి చిన్నప్పట్నుంచి వింటున్నాను. అలాగే మీరు రోజురోజుకు ఎదగడం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా’ అంటూ తనదైన స్టైల్‌లో రజనీపై ప్రశంసలు కురిపిస్తూ స్వీట్ మొమోరిస్ గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ మరోసారి వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Next Story