- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్ సినిమాలో అతిథి పాత్రలో అమితాబ్ బచ్చన్.. డైరెక్టర్ కామెంట్స్‌తో అంతా షాక్!
వివాదాస్పద సరిహద్దు ప్రారంతమైన గల్వాన్ లోయలో భారత, చైనా దళాల మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణ.

దిశ, సినిమా: వివాదాస్పద సరిహద్దు ప్రారంతమైన గల్వాన్ లోయలో భారత, చైనా దళాల మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణ. 2020లో లడఖ్‌లోని గల్వాన్ యుద్ధం జరగ్గా.. ఈ ప్రాంతంలో తుపాకీలు నిషేధించబడినందున, సైనికులు కర్రలు, రాళ్లను ఉపయోగించి చేతులతో మాత్రమే పోరాడారు.ఇక ఈ యుద్ధంలో దాదాపు 45 సంవత్సరాలలో చైనా-భారత సరిహద్దు వివాదంలో ఈ ఘర్షణ మొదటి ప్రాణనష్టాన్ని గుర్తించింది. ఈ సంఘటన ఆధారంగా ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్నారు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్‌తో రాబోతుండగా.. ఇందులో సల్మాన్ మొదటి సారి సైనికుడిగా నటించబోతున్నాడు.
హిమేష్ రేషామియా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన చిత్రాంగద సింగ్ రొమాన్స్ చేయనుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు టాక్. ఇటీవల ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ దర్శకుడు అమితాబ్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టా్లో షేర్ చేయడంతో పుకార్లు జోరందుకున్నాయి. బిగ్‌బీ నాకు ఏం చెబుతున్నారో ఎవరైనా ఊహించగలరా? అని షూట్‌లో ఉన్న పిక్ పెట్టడంతో పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, అపూర్వ లఖియా రూమర్స్‌కు చెక్ పెట్టాడు. ‘‘గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
మా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు నటించడం లేదు. ఇక ఫొటో విషయానికొస్తే.. మా షూట్ జరుగుతున్న ప్రదేశంలోనే అమితాబ్ మరో యాడ్ షూట్ చిత్రీకరణ కోసం వచ్చారు. ఆ సమయంలో నేను ఆయనను కలిసి మాట్లాడిన తర్వాత నేను ఓ ఫొటో తీసుకున్నాను. దానిని సోషల్ మీడియాలో పెట్టుకున్నాను. అంతే తప్ప ఆయన ఇందులో నటించడం లేదు. తప్పుడు వార్తలు నమ్మకండి. అలాంటిది ఏమైనా ఉంటే మేము అధికారికంగా ప్రకటిస్తాము’’ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది. ఇక ఈ విషయంపై కొంత మంది నెటిజన్లు షాక్ అవుతూ సాడ్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






