కోర్టులో సరెండర్ అయిన అమీషా పటేల్‌.. బయటకు వస్తూ ఏం చేసిందంటే..

by samatah |
కోర్టులో సరెండర్ అయిన అమీషా పటేల్‌.. బయటకు వస్తూ ఏం చేసిందంటే..
X

సినిమా : సినీ నిర్మాత, వ్యాపారవేత్త అజయ్‌ కుమార్‌, నటి అమీషా పటేల్‌పై చెక్‌‌ బౌన్స్‌ కేసు వేసిన విషయం తెలిసిందే. మూవీ ప్రొడక్షన్ కోసం అమీషా తన దగ్గర రూ. 2.5 కోట్లు అప్పుగా తీసుకుందని, ఆ తర్వాత ఆమె సినిమా పూర్తిచేయలేదని, తన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని అజయ్‌కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కాగా తాజాగా ఇవాల్టి ఉదయం రాంచి సివిల్‌ కోర్టులో అమీషా సరెండర్ అయింది. దీంతో కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కాగా కోర్టు నుంచి ఆమె బయటకు వచ్చేటప్పుడు ముఖానికి ముసుగు వేసుకుని వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: అప్పుడే ‘ఖుషీ’ OTT డీల్ కంప్లీట్ అయిపోయిందా?

Next Story