‘గదర్ 2’ వివాదం.. అమీషా ఆరోపణలపై నిర్మాత రియాక్షన్ ఇదే.. మంచి పని చేసిందిలే అంటూ..

by samatah |   (  Updated:2023-07-07 10:03:13  IST  )

అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తనను ఇబ్బంది పెట్టిందనే అమీషా పటేల్ ఆరోపణలపై చిత్ర నిర్మాత అనిల్ శర్మ స్పందించాడు. చండీఘఢ్ ‘గదర్ 2’ సెట్స్‌లో తనను అసలే పట్టించుకోలేదని, ఫుడ్ ఇతరత్ర అవసరాలు కూడా తీర్చలేదంటూ

‘గదర్ 2’ వివాదం.. అమీషా ఆరోపణలపై నిర్మాత రియాక్షన్ ఇదే.. మంచి పని చేసిందిలే అంటూ..
X

దిశ, సినిమా: అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తనను ఇబ్బంది పెట్టిందనే అమీషా పటేల్ ఆరోపణలపై చిత్ర నిర్మాత అనిల్ శర్మ స్పందించాడు. చండీఘఢ్ ‘గదర్ 2’ సెట్స్‌లో తనను అసలే పట్టించుకోలేదని, ఫుడ్ ఇతరత్ర అవసరాలు కూడా తీర్చలేదంటూ ట్వీట్ చేసింది అమీషా. అయితే ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన అనిల్.. ‘ఆమె ఇదంతా ఎందుకు చెప్పిందో నాకు అంతుబట్టడం లేదు. ఇదంతా అబద్ధం. అదే సమయంలో అమీషాకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ రకంగానైనా నా ప్రొడక్షన్ హౌస్‌కి పేరు తెచ్చింది’ అంటూ నటి ఆరోపణలు కొట్టిపారేశాడు. ఇక ఈ మూవీ నుంచి అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తప్పుకున్న తర్వాత జీ స్టూడీయోస్ నిర్మాణ బాధ్యతలు తీసుకోగా ఆగస్టు 11న సినిమా రిలీజ్‌ కానుంది.

Read More: విజయ్ దేవరకొండతో విడిపోతున్న Rashmika Mandanna ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Next Story