ఒక్కో యాడ్‌కు లక్షల్లో తీసుకునే అల్లు అర్జున్.. ఇప్పుడు ఇన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా?

by Bhoopathi Nagaiah |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు. ‘పుష్ప’ సక్సె్స్‌తో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

ఒక్కో యాడ్‌కు లక్షల్లో తీసుకునే అల్లు అర్జున్.. ఇప్పుడు ఇన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా?
X

దిశ, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు. ‘పుష్ప’ సక్సె్స్‌తో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇందులో నటనకుగాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన ఫేవరేట్ యంగ్ స్టార్ అని చెప్పేస్థాయికి ఎదిగాడు. ఇదిలా ఉంటే ‘రెడ్ బస్’, ‘ఫ్రూటీ’, ‘జొమాటో’ లాంటి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న ఆయన.. ‘పుష్ప’ ఎఫెక్ట్‌తో రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఒక్కో యాడ్‌కు రూ. 35లక్షలు తీసుకున్న బన్ని.. ప్రస్తుతం రూ. 6 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్.

కాగా దీనిపై స్పందిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఒక్క యాడ్‌కు ఇంత పెద్ద మొత్తంలో చెల్లిస్తే కంపెనీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయొద్దని కోరుతున్నారు.

Next Story