- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆమెకు అండగా నిలిచి తన గొప్ప మనసు చాటుకున్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య భారంతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె, ప్రస్తుతం సికిందరాబాద్‌లోని ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమంలో తన కుమార్తెతో కలిసి ఉంటున్నారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నారని తెలుసుకున్న బన్నీ, వెంటనే స్పందించి వారికి భరోసానిచ్చారు.
కేవలం ఒక్కసారి సాయం చేసి వదిలేయకుండా, పావలా శ్యామల గారి కుటుంబానికి శాశ్వత పరిష్కారం చూపాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. వారి నిత్యవసరాలు, వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందేలా గట్టి ఏర్పాటు చేశారు. గతంలో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు అండగా నిలిచినప్పటికీ, బన్నీ ఇలా ప్రతి నెలా క్రమం తప్పకుండా సాయం చేస్తానని ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కష్టాల్లో ఉన్న సీనియర్ నటిని ఆదుకోవడానికి బన్నీ చూపిన ఈ చొరవను చూసి నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన హీరో అనిపించుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.






