Upasana: మెగా ఫ్యామిలీ డబుల్ సెలబ్రేషన్స్‌కు అల్లు అర్జున్ కుటుంబం దూరం.. గొడవలే కారణమా!

by Mallepaka Hamsa |

మెగా కోడలు ఉపాసన(upasana) అభిమానులకు దీపావళి పండుగ రోజున డబుల్ గుడ్ న్యూస్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Upasana: మెగా ఫ్యామిలీ డబుల్ సెలబ్రేషన్స్‌కు అల్లు అర్జున్ కుటుంబం దూరం.. గొడవలే కారణమా!
X

దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన(upasana) అభిమానులకు దీపావళి పండుగ రోజున డబుల్ గుడ్ న్యూస్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది వరకే ఓ కూతురుకి జన్మనిచ్చిన ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా రెండవసారి కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వెల్లడించడంతో.. అంతా షాక్‌కు గురయ్యారు. ఇక ఇటీవల అత్యంత ఘనంగా సీమంతం వేడుకలు చేసుకున్న ఆమె.. ఓ వీడియోను షేర్ చేసింది. ఇక సీమంతం వేడుకల్లో పాల్గొన్న మెగా కుటుంబ సభ్యులందరూ.. నాగబాబు, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వాయువ్ తేజ్, చిరంజీవి ఇద్దరు చెల్లెల్లు, నిహారిక హాజరై సందడి చేశారు. అంతేకాకుండా టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. నాగార్జున దంతులతో పాటు వెంకటేష్ కపుల్, నయనతార దంపతులు కూడా ఈ వేడుకల్లో భాగం అయ్యారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రామ్ చరణ్, ఉపాసనలకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకల్లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గత కొద్ది కాలంగా మనస్పర్థలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే.. ఇటీవల అల్లు నాగరత్నమ్మ మరణించడంతో రెండు కుటుంబాలు కలిసిపోయాయి. దీంతో అందరూ గొడవలు సర్దుమనిగినట్లే అని అనుకున్నారు. కానీ ఉపాసన సీమంతం వేడుకల్లో అల్లు స్నేహ, అల్లు అర్జున్ కనిపించకపోవడానికి కారణం గొడవలే అని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు అల్లు ఫ్యామిలీ రాకపోవడానికి కారణాలేంటో తెలియనప్పటికీ.. అందరూ అందుకే రాలేదని అంటున్నారు.

Next Story