త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న అల్లు అర్జున్.. కార్తికేయుడిగా కనిపించబోతున్న స్టార్ హీరో.. హింట్ ఇచ్చేసిన నాగవంశీ

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-12 13:35:31  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా అయ్యేలా చేశారు.

త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న అల్లు అర్జున్.. కార్తికేయుడిగా కనిపించబోతున్న స్టార్ హీరో.. హింట్ ఇచ్చేసిన నాగవంశీ
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా అయ్యేలా చేశారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలోనూ ఈ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మైథాలజీ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై నాగవంశీ (Naga Vamsi)ట్విట్టర్ ద్వారా స్పందించాడు. నిర్మాత నాగవంశీ కుమార స్వామికి సంబంధించిన రెండు శ్లోకాలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా ఫేవరేట్ అన్న మోస్ట్ పవర్ ఫుల్ గాడ్ గా కనిపించబోతున్నాడు అని వెల్లడించాడు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కార్తికేయుడిగా నటించనున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం నిరాశ చెందుతున్నారు. అయితే బన్నీకి మూడు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడో అని నెట్టింట చర్చలు జరుపుతున్నారు. కాగా, ఎన్టీఆర్ ‘వార్-2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు. దీనిని యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా.. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ స్పై యాక్షన్ డ్రామా ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ, భాషల్లో థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ డబ్బింగ్ కూడా ఎన్టీఆర్ స్టార్ట్ చేశారు.

Next Story