ఈ స్థాయి గుర్తింపు రావాలంటే 20 ఏళ్లు పట్టేది : ఐకాన్ స్టార్

by Disha Web |
ఈ స్థాయి గుర్తింపు రావాలంటే 20 ఏళ్లు పట్టేది : ఐకాన్ స్టార్
X

దిశ, సినిమా : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. ఇండియన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ మూవీతో అల్లు అర్జున్‌‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'పుష్ప సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అస్సలు అనుకోలేదు. ఇది నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా లేకుంటే ఇంత ప్రేమను పొందడానికి నాకు దాదాపు 20 సంవత్సరాలు పట్టేది. ఇక 'పుష్ప ది రూల్‌' పైనా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ప్రయత్నిస్తాం' అని చెప్పుకొచ్చాడు బన్నీ.

రామ్ చరణ్‌ సినీ ప్రస్థానంపై చిరు ఎమోషనల్ ట్వీట్..

Next Story

Most Viewed