- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘శక్తిమాన్’ సినిమాలో అల్లు అర్జున్.. డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్.. ఎలాంటి మార్పు లేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph) ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మెప్పించారు.

దిశ, సినిమా: మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph) ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మెప్పించారు. ఎక్కువగా మలయాళ సినిమాలే చేసిన ఆయన ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శక్తిమాన్’(Shaktimaan) తో రాబోతున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను మెయిన్ లీడ్‌గా కన్ఫర్మ్ చేశారు.దీంతో గత కొద్ది కాలంగా ఈ మూవీకి సంబంధించిన వార్తలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇందులో శక్తిమాన్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాసిల్ ఈ విషయంపై స్పందించారు. ‘‘శక్తిమాన్ చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ప్రాజెక్ట్ రణ్‌వీర్ సింగ్(Ranveer Singh)తోనే జరుగుతుంది. తన స్థానంలోకి మరొకరు వస్తున్నారని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి మార్పు లేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.






